రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న యోచనలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. జర్మనీ తరహాలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి త్వరితగతిన నివేదిక అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు