హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. నగర శివారు ప్రాంతాల్లో రూ.82.23 కోట్లతో నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి సిద్ధమైంది. శంకర్‌పల్లి, శంషాబాద్, గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో మురుగునీటిని శుద్ధి చేసి జంట జలాశయాలను కాపాడనున్నారు. 2050 వరకు మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎస్టీపీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.