హైదరాబాద్‌లో స్కూళ్లు, కాలేజీల వద్ద అక్రమంగా పొగాకు అమ్ముతున్న దుకాణాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో చేపట్టిన భారీ డ్రైవ్‌తో ఏకంగా 558 షాప్‌లలో తనిఖీలు చేపట్టారు. పొగాకుతో ప్రారంభమై.. విద్యార్థులు ఆల్కహాల్, డ్రగ్స్, నేరాల వంటి వాటికి అలవాటై.. తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు బాధ్యత వహించి.. విద్యార్థులను పెడదోవ పట్టకుండా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.