నిరుద్యోగులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తాత్కాలికంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె కారణంగా ప్రజా రవాణా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండో రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఎలాగైనా బస్సులు నడిపించాలని యాజమాన్యం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అద్దె బస్సులతోపాటు.. ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతున్నారు.