తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం హైదరాబాద్‌లోనూ అమలు కానుంది. నగరంలో గుడిసెలు, తాత్కాలిక నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే యాకూత్‌పురా, మలక్‌పేట, కంటోన్మెంట్ ప్రాంతాల ప్రజలు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. జీ+3 లేదా జీ+5 విధానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించనున్నారు. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీకి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాలు మీకోసం..