హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా తెలంగాణ బిడ్డలే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం

4 weeks ago 3
ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడటం దారుణమన్నారు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా.. కనీసం ఏం మాట్లాడుతున్నాం అని విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్ట కరమన్నారు. సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అందరూ మన బిడ్డలే .. దయచేసి ఆంధ్ర, తెలంగాణ అనే భావం తేవొద్దన్నారు. హైదారాబాద్ ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారని.. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read Entire Article