హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో సోమవారం సాయంత్రం రోడ్డు ఎరుపెక్కింది. హత్యలు, యాక్సిడెంట్లు జరిగితే ఏరులై పారిన రక్తం మాదిరిగా.. మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు స్థానికులను టెన్షన్‌కు గురి చేసింది. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండంతో వాటి ద్వారా మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.