హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. భూముల వేలానికి HMDA సన్నాహాలు చేస్తోంది. దాదాపు 1000 ఎకరాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతోంది. భోగారం, బాటసింగారం, ప్రతాపసింగారం తదితర ప్రాంతాల్లో భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నారు. లేఅవుట్లలో 50 శాతం మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ప్లాట్లు చర్యలు తీసుకుంటున్నారు.