హైదరాబాద్‌లోని పోచారం, బండ్లగూడ ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిపోయిన సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లకు ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఆగస్టు 4 నుంచి 6 వరకు కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి, తొర్రూరులో ఉన్న 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువకు లభించే ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఇది మంచి అవకాశం.