వీసాలు, పాస్‌పోర్టులు సహా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోన్న వీరి గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురు మహిళలు సహా ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి వారి దేశానికి పంపనున్నట్టు అధికారులు తెలిపారు.