హైదరాబాద్‌లో పాలపొడి, రసాయనాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగర శివార్లలో ఈ కల్తీ పాలు తయారు చేసి.. హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఈ కల్తీ పాలు ఎక్కడెక్కడ సరఫరా అయ్యాయనే అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.