కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి హిమపాత ప్రదేశాల్లో మాత్రమే సాగు చేసే.. కుంకుమ పువ్వును హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా సాగు చేయొచ్చని నిరూపిస్తున్నాడు ఓ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. 270 చదరపు అడుగుల గదిలోనే కుంకుమ పువ్వును సాగు చేస్తూ.. అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇప్పటికే 70 గ్రాముల కుంకుమ పువ్వు దిగుబడి రాగా.. మరో 70 నుంచి 80 గ్రాముల కుంకుమపువ్వు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు.