హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. గంట నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దయింది. పలు ఏరియాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ఇక తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.