హైదరాబాద్ బంజారాహిల్స్‌లో టాస్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో యాజమాన్యం ఫోన్ కాల్ చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు తేలింది. పబ్‌కి వచ్చిన కస్టమర్లకు వేల రూపాయల బిల్లులు కూడా వేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.