హైదరాబాద్‌లో సుమారు 100 ఏళ్ల తర్వాత నిర్మించిన అతిపెద్ద రైల్వేస్టేషన్ అయిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పుడు అప్పుడు అంటూనే రెండు నెలల్లో నాలుగు సార్లు ప్రారంభోత్సవం వాయిదా పడగా.. ఇప్పుడు మరో కొత్త తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 28న ప్రారంభించాల్సి ఉండగా.. మన్మోహన్ సింగ్ మరణంతో అది కాస్త వాయిదా పడింది. కాగా.. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించగా.. అందరూ ఆశగా చూస్తున్నారు.