హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుళ్లలో అల్లుడు అర్జున్ మృతదేహం లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ విషాద ఘటనలో అర్జున్ దాదాపు 60 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి నల్గొండ జిల్లాలోని సంగెం గ్రామ సమీపంలో మూసీ నది వద్ద కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.