హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.