హైదరాబాద్‌లో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ‘భారత్ సమ్మిట్ 2025’ జరగనుంది. 100 దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్న ఈ సదస్సులో గ్లోబల్ జస్టిస్ అంశంపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్‌ను తెలంగాణకు గర్వకారణంగా అభివర్ణించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలు పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ ఆర్థిక, సామాజిక , రాజకీయ సమాచార న్యాయం వైపు ఒక స్పష్టమైన మార్గాన్ని సూచిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.