హైదరాబాద్ నగరంలో వాయి కాలుష్యం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోగా.. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరంలోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యుస్ కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం (ఫిబ్రవరి 24న) మధ్యా్హ్నం సమయంలో సనత్‌నగర్‌లో ఏకంగా 431 ఏక్యూఐ నమోదు కావటం కాస్త ఆందోళనకరంగా మారింది.