హైదరాబాద్‌లో డ్రోన్ల ద్వారా ఈ-కామర్స్ వస్తువులను డెలివరీ చేసేందుకు స్కై ఎయిర్ సంస్థ చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి నగరంలో డ్రోన్ల ద్వారా వస్తువులను చేరవేయనుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో చేపట్టిన ఈ డ్రోన్ డెలివరీలు సక్సెస్ కావడంతో.. మిగిలిన నగరాలకు కూడా విస్తరిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్‌తో కలిసి పనిచేయనుంది. హైదరాబాద్‌లో నిత్యం 3.75 లక్షల డెలివరీలు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.