హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. టోలిచౌకిలో ఇర్ఫాన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ విషయంలో ఇర్ఫాన్ తమ్ముడు కొందరితో గొడవ పడ్డాడు. అనంతరం వారంతా ఇర్ఫాన్ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇర్ఫాన్‌ను పారామౌంట్ కాలనీ గేటు వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.