హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారుడిని చంపిన సిరాజ్ అనే వ్యక్తి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనను చూసి అతడి పెద్ద కుమారుడు భయంతో పారిపోయాడు. కుటుంబ కలహాలే దారుణానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.