హైదరాబాద్‌లో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ నాలుక కోసేసిన ప్రియుడు

3 months ago 15
హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహజీవనం చేస్తున్న ఒక మహిళపై ఆమె ప్రియుడు అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కుషాయిగూడకు చెందిన 50 ఏళ్ల మహిళ నవీన్ అనే వ్యక్తితో గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. ఈ నెల 22న అర్ధరాత్రి ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదంలో ఆగ్రహానికి గురైన నవీన్.. చాకుతో ఆమె నాలుకను కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article