హైదరాబాద్‌లో శుక్రవారం ట్రాఫిక్ జామ్ నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పర్యటన, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక, కేసీఆర్‌ను పరామర్శించడానికి బీఆర్‌ఎస్ శ్రేణుల రాకతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది. లక్డీకాపుల్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సాయంత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు