హైదరాబాద్‌లో పక్కకు ఒరిగిన బిల్డింగ్.. భయంతో పరుగులు తీసిన జనం

1 year ago 27
హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన ఇప్పుడు ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో నగరవాసులు ఆందోళన చెందుతుంటే.. ఓ బిల్డింగ్ మాత్రం దానికదే పక్కకు ఒరిగింది. ఈ ఘటన మాదాపూర్‌లోని సిద్దిక్ నగర్‌లో చోటుచేసుకుంది. మంగళవారం (నవంబర్ 19న) రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. గమనించిన చుట్టుపక్కన వాళ్లు భవనంలో నివాసం ఉన్నవారిని అప్రమత్తం చేయటంతో.. భయంతో బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ పక్కనే సెల్లార్ గుంతలు తీయటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది.
Read Entire Article