హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి మెుదలైంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభం కానుంది. ఈ మేరకు బోనాల ఏర్పాట్లుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.