తెలంగాణలో మరో ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. అదే వరుసలో మరో సంస్థ కూడా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే.. ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీదారుగా దేశవ్యాప్తంగా పేరు పొందిన అంబర్- రెసోజెట్ సంస్థ హైదరాబాద్‌లో రూ. 250 కోట్లతో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది.