తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ‘తెలంగాణ రైజింగ్ విజన్’లో భాగంగా.. హైదరాబాద్‌లో మరో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ (MOU) కుదుర్చుకోనున్నారు. ఈ కొత్త ఫిల్మ్ సిటీలో రామోజీ ఫిల్మ్ సిటీ కంటే అదనపు అత్యాధునిక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. అలాగే, రిలయన్స్ గ్రూప్ నైట్ సఫారీ కోసం, ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ రూ.3 వేల కోట్లతో హోటళ్ల నిర్మాణం కోసం గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకోనున్నాయి.