హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో స్థానికులు

1 year ago 19
హైదరాబాద్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది, దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
Read Entire Article