హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి, జిల్లాలు, ఇతర రాష్ట్రాల బస్సుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఆరాంఘర్ వద్ద కొత్త అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. దీనికోసం NH 44 పక్కన 7.22 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఈ టెర్మినల్ నిర్మాణంపై కీలక అప్డేట్ ఇచ్చారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది దక్షిణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందన్నారు. భూసేకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.