హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు అమృత్ భారత్ పథకం కింద వేగంగా జరుగుతున్నాయి. ఈ స్టేషన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బేగంపేట్‌లో మెరుగైన సౌకర్యాలు, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్స్, విశాలమైన ప్లాట్‌ఫార్మ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు.. స్టేషన్ ఫొటోలను కూడా షేర్ చేశారు. సికింద్రాబాద్, హైటెక్ సిటీతో పాటు తెలంగాణలోని పలు స్టేషన్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.