హెచ్‌ఎండీఏ భూముల అమ్మకాలకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని స్థలాలను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. కోకాపేట, కూకట్‌పల్లిలో 47 ఎకరాల భూమిని వేలం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోకాపేటలో ఎకరా ప్రారంభ ధర రూ.99 కోట్లు, కూకట్‌పల్లిలో రూ.75 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.4,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.