హైదరాబాద్‌లో సంచలనం రేపిన లాయర్ హత్య ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. లాయర్ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములపై న్యాయ పోరాటం చేస్తున్నందుకే ఈ హత్య చేశారని ఓవైసీ ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే పక్కాగా ఈ హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో న్యాయం జరిగే వరకు బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.