హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతోంది. నగరంలో ఇళ్ల విక్రయాల్లో ఐదు కంపెనీలు టాప్ 5 లో స్థానం దక్కించుకున్నాయి. 2021 నుంచి 2025 వరకు ఆయా కంపెనీలు నగరంలో జరిపిన ఇళ్ల అమ్మకాల ఆధారంగా వీటిని గుర్తించారు. ఈ టాప్ 5 జాబితాలో మై హోం గ్రూప్, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, రాజపుష్ప ప్రాపర్టీస్ టాప్ 3 స్థానాల్లో నిలిచాయి. రానున్న ఐదేళ్లలోనూ ఈ మూడు కంపెనీలే తమ ఆధిపత్యాన్ని కొనసాగించనున్నాయని సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక వెల్లడించింది.