హైదరాబాద్‌లో రూ. 4 వేల కోట్ల విలువైన భూమిపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కర్నూలు బాలసాయిబాబా ట్రస్ట్‌కు చెందిన ఈ భూమిపై తెలంగాణకు హక్కు లేదని ఆంద్రప్రదేశ్ వాదించింది. ఈ భూమి నిర్వహణ తమ పరిధిలోనే ఉందని చెప్పింది. ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేసిన ఏపీ.. ఈ విషయాలు కోర్టుకు తెలిపింది.