హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైప్‌లైన్‌లో లీకేజీలను సరిచేయడానికి మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతులు సెప్టెంబర్ 24, బుధవారం ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 25, గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. దీంతో ఆర్‌సి పురం, మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఒత్తిడి తక్కువగా ఉండవచ్చ లేదా తాత్కాలికంగా ఆగిపోవచ్చు. ఈ సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ప్రజలకు సూచించారు.