హైదరాబాద్ పోలీసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం నగరంలో 4 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం స్టేడియం నిర్మాణం కోసం స్థలం వెతికే పనిలో ఉంది. దీనిలో భాగంగా అంబర్‌పేట లేదా ఆరాంఘర్ చౌరస్తాలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం స్థలం పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం చివరి నాటికి పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ..