దివంగత మాజీ మంత్రులు పి. శివశంకర్, ముఖేష్ గౌడ్‌ల విగ్రహాలను త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. బీసీ నాయకులుగా వారి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శివశంకర్ కేంద్ర న్యాయ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల శాఖ మంత్రిగా, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. ముఖేష్ గౌడ్ బీసీ సంక్షేమం, మార్కెటింగ్ శాఖ మంత్రిగా సేవలందించారు.