హైదరాబాద్‌లో హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ రెడ్డి మరియు 5వ తరగతి చదువుతున్న వారి కుమారుడు ఉన్నారు. ఉద్యోగం లేక ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి.. ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చంపి.. ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.