హైదరాబాద్ రాజధాని పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రస్తుతం ఉన్న ఠాణాలు, డివిజన్లు, జోన్ల సరిహద్దులను మార్చనున్నారు. శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, నేరాలు, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పునర్వ్య వస్థీకరణ చేపడుతున్నారు. అజీజ్‌నగర్, కోకాపేట, బడంగ్‌పేట్, బోడుప్పల్, మౌలాలి తదితర ప్రాంతాల్లో కొత్త ఠాణాల ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంది.