ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించారు. మంగళవారం ఏపీ నూతన ఐటీ పాలసీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా డీప్ టెక్ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజులన్నీ ఏఐ, డీప్ టెక్నాలజీవేనన్న చంద్రబాబు.. ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.