హైదరాబాద్‌లో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన వేలంలో భారీ ధర పలికాయి. 14 ప్లాట్లను వేలం వేయగా.. ఏకంగా రూ.14.75 కోట్ల ఆదాయం సమకూరింది. చదరపు గజానికి కనీస ధర రూ.32 వేలు నిర్వహించగా.. గరిష్ఠంగా రూ.51 వేలకు విక్రయం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మరో విడత వేలం ఈనెల 23న నిర్వహించనున్నారు.