హైదదారాబాద్ రాయదుర్గంలో విదేశీ గంజాయి పట్టుబడింది. విదేశాల నుంచి ఖరీదైన గంజాయిని తెప్పించి.. నగరంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో హై క్వాలిటీ ఓ జీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి బెంగళూరుకు.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నారు. సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం THC ఉంటే.. ఈ హై క్వాలిటీ గంజాయిలో అది 25 శాతం ఉంటుంది. ఈ గంజాయిని ఒక గ్రాము రూ.3 వేల చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు.