హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా ఈ వ్యవహారంలో కేసు నమోదైంది. అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది.