తెలుగు సినీ పైరసీలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి (ఇమంది రవి)ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆరేళ్లలో కోట్లు సంపాదించిన రవి.. దేశ విదేశాల్లో ఏజెంట్లను, సర్వర్లను ఉపయోగించి పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడు. తనను పట్టుకోలేరని పోలీసులకు సవాల్ విసిరాడు. చివరకు.. ఒక ఈ-మెయిల్ లింక్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టి, రవి హైదరాబాద్‌కు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. మిత్రుడికి పంపిన 'మామా హైదరాబాద్ వచ్చా' అనే ఒకే ఒక్క మెసేజ్ ఆధారంగా కూకట్‌పల్లిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రవి పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు.. కానీ విదేశీ డేటా గురించి సమాధానాలు దాటవేస్తున్నాడు.