హైదరాబాద్‌లో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించేందుకు జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకం సాగనుంది. రైల్వేకు వచ్చే రూ. 10 కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైళ్ల సంఖ్య పెంపు, సమయపాలన మెరుగుదల, స్టేషన్లకు ఆర్టీసీ షటిల్ బస్సులు నడపడం వంటి చర్యల ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేయడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.