హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు చెల్లించాల్సిందే..

1 month ago 3
హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు.. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు జీహెచ్‌ఎంసీ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు జరిమానాల విధానం అనేక సందర్భాల్లో మొక్కుబడిగా మారింది. అయితే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇలంబర్తి స్పష్టంగా తెలిపారు. దీనిలో భాగంగానే ప్లాస్టిక్ ను నివారించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్లాస్టిక్‌ కవర్లు, సంచుల నిల్వ లేదా విక్రయం చేస్తే.. మొదటి తప్పుకు మొదటి తప్పునకు రూ.10వేలు జరిమానా విధిస్తుండగా.. రెండో తప్పునకు రూ.25వేలు జరిమానా చెల్లించాలి. ఇక మూడో తప్పునకు దుకాణం మూసి వేస్తారు.
Read Entire Article