సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 3,600 కేసులు నమోదయ్యాయి. ఇకపై సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అని డీసీపీ హెచ్చరించారు.