LB Nagar Metro Station Skywalk: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రో రైలు దిగి ట్రాపిక్‌లో విన్యాసాలు చేస్తూ రోడ్లు దాటాల్సిన అవసరం లేకుండానే ఇంటికి చేరుకోవచ్చు. ఎలాగంటారా..? ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర్లో నిర్మిస్తోన్న భారీ నివాస సముదాయాలకు డైరెక్టుగా స్కైవాక్ నిర్మించుకునేందుకు మెట్రో సంస్థ అనుమతులిచ్చింది. మరోవైపు.. నాగోల్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌ల మధ్య విశాలమైన స్కైవాక్ నిర్మించాలని భావిస్తున్నారు. మరోవైపు.. ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలోనూ స్కైవాక్ నిర్మించనున్నారు.