హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. నగరంలో కొత్తగా స్కైవాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. పాదాచారుల కోసం పలు కూడళ్లలో స్కైవాక్‌లు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్లలో కొత్తగా స్కై్వాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.